నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: 33/11 కేవీ భీమవరం సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నరసయ్య అగ్రహారం, కొడవలి రోడ్, ఇండస్ట్రీయల్ ఏరియా, హౌసింగ్ బోర్డు కాలనీతో సహా పలు ప్రాంతాలకు విద్యుత్ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం గుర్తించి వినియోగదారులు సహకరించాలని ఈ ఈ కోరారు.