'విశాఖ "ది డెక్" పార్కింగ్ టెండర్ గడువు పొడిగింపు'

'విశాఖ "ది డెక్" పార్కింగ్ టెండర్ గడువు పొడిగింపు'

విశాఖ సిరిపురం జంక్షన్‌లోని వీఎంఆర్‌డీఏ నిర్మించిన "ది డెక్" మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, వాణిజ్య సముదాయంలోని పార్కింగ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ టెండర్ గడువును మరో వారం రోజులు పొడిగించారు. అక్టోబర్ 31, 2025 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత గుత్తేదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.