VIDEO: హిట్ టీవీ ఎఫెక్ట్.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

ASR: అనంతగిరి మండలం చిన్నకోనెల గ్రామానికి గురువారం అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. సుమారు రెండు నెలల నుంచి కరెంటు లేక చిన్నకోనెల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారంటూ గురువారం హిట్ టీవీలో వచ్చిన వార్తకు స్పందన లభించింది. అధికారులు గ్రామానికి ట్రాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.