మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభం

మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభం

SRD: కంగ్టి మండలం చౌకన్పల్లి గ్రామంలో మహిళలు, కిశోర బాలికలకు కుట్టు శిక్షణ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. గ్రామ స్వరాజ్య సంస్థ మండల కోఆర్డినేటర్ మహానంద ఆలూరే పర్యవేక్షణలో స్థానిక పాఠశాల భవనంలో 30 మందికి ట్రైనర్ నవనీత పాటిల్ కుట్టు శిక్షణను మొదలుపెట్టారు. శిక్షణ కాలం పూర్తయ్యాక 50 శాతం కింద కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తామని కోఆర్డినేటర్ తెలిపారు.