గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

KRNL: సీ.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ గ్రామానికి చెందిన కురువ శివకుమార్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. హఠాత్తుగా గుండెల్లో మంట, నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. శివ కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.