తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ: కలెక్టర్

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ: కలెక్టర్

KNR: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహాత్మా జ్యోతిబాఫులే మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు గురువారం నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తాము రూపొందించిన బతుకమ్మల్ని ఒకచోట చేర్చి ఆట, పాటలతో సందడి చేశారు. అనంతరం మహిళలతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడారు.