నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్
SKLM: గార మండలంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పైడి యోగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎత్తిపోతల పథకానికి విద్యుత్తు సరఫరా క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఉ. 8 నుంచి మ. 2 గంటల వరకు గార, బందరువానిపేట, కళింగపట్నం, వమరవల్లి తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని అన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.