రూ. 2లక్షలు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. అప్పగింత

తిరుపతి: బెంగళూరుకు చెందిన జ్యోత్న్స తిరుమల దర్శనానికి వచ్చారు. నిన్న రాత్రి సర్వదర్శనం క్యూలైన్‌లో రూ.2 లక్షల నగదు ఉన్న హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ జి.రాజీవ్ ఆ బ్యాగ్‌ను గుర్తించారు. భక్తురాలి వివరాలు సేకరించి ఇవాళ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆమెకు అప్పగించారు. దీంతో కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు.