గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

BDK: ఒడిస్సా రాష్ట్రం నుండి కేరళకు డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న ముగ్గురు నిందితుల నుండి 53 లక్షల విలువచేసే 107 కేజీల నిషేధిత గంజాయిని పాల్వంచ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం వ్యాన్,1 కారు, ఆరు సెల్ ఫోన్లు, 6 నైన్ ఎంఎం పిస్టల్స్,12 ఖాళీ మ్యాగజైన్స్, 45 బుల్లెట్లు, 35,500 నగదు, స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు.