CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MDK: అనారోగ్యంతో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు CM రిలీఫ్ ఫండ్ చెక్కులను MLA సునితా లక్ష్మారెడ్డి శుక్రవారం అందజేశారు. కౌడిపల్లి మండలం తునికి, పిల్లికుంట తాండాలకు చెందిన లబ్ధిదారులకు రూ.1,66,000 విలువైన చెక్కులను ఆమె హైదరాబాద్ మాదాపూర్‌లోని నివాసంలో పంపిణీ చేశారు. పేదల ఆర్థిక ఇబ్బందుల నివారణలో సీఎం రిలీఫ్ ఫండ్ వరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.