సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శంకర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.