VIDEO: కొత్తగూడ మండల ప్రజలకు ఎస్సై సూచనలు

MHBD: కొత్తగూడ మండలంలో గత రాత్రి కురిసిన భారీవర్షానికి పలు రహదారులలో ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయని శనివారం ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో చేపల వేటకు ఎవరు వెళ్లవద్దని, వాగులు దాటడానికి ఎవరు ప్రయత్నించవద్దని కోరారు. వాగుల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సాహసాలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.