కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KNR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తున్నదని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో తిమ్మాపూర్ మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.