VIDEO: జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వెలంపాడు వద్ద ఉన్న సోమనీ టైల్స్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు చీరాలకు చెందిన పోతురాజు, ఒడిశాకు చెందిన పాండే అనే కార్మికులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.