రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
SKLM: ఆమదాలవలస మండలం పార్వతీశంపేట సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ పైడి యోగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెట్లు కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం ఈ అంతరాయం ఏర్పడిందన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.