జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మేయర్

జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మేయర్

KMM: నగరంలోని 32వ డివిజన్‌ జమలాపురం కేశవరావు పార్కులో ఏర్పాటు చేసిన KMC నూతన జోనల్ కార్యాలయాన్ని సోమవారం మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా మున్సిపల్ సేవలను అందించేందుకు జోనల్ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పౌర సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.