నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
MDCL: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (మల్లి పూజిత) కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.