జిల్లాలో పెరుగుతున్న చలి
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత గత మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుంది. ఘట్‌కేసర్ పరిధి కొండాపూర్‌లో అత్యల్పంగా 12.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండాపూర్, ఘట్‌కేసర్, దేవరయంజాల, మల్కారం, ఉప్పల్, దూలపల్లి ఫారెస్ట్ ఏరియా, అలియాబాద్ ప్రాంతాల్లో అత్యధిక చలి ఉన్నట్లుగా TSRPS గ్రానులర్ రిపోర్ట్ తెలిపింది.