నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి

SRPT: కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. గురువారం మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలన్నారు.