యూఏఈ పోర్టులోని కంటైనర్ షిప్‌పై డ్రోన్ దాడి
పశ్చిమాసియాలో దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా యూఏఈలో పోర్టులోని ఓ కంటైనర్ నౌకపై దాడి జరిగింది. దీంతో కంటైనర్ నౌక ధ్వంసమైనట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. షిప్‌లోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది.