'యూరియాపై లేఖలు కాదు ఉద్యమం చేయాలి'

'యూరియాపై లేఖలు కాదు ఉద్యమం చేయాలి'

KMM: కేంద్ర అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాయడం కాదని, ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం వైరాలో ఆయన మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఎరువులు సకాలంలో సరఫరా చేసి వ్యవసాయ దిగుబడులు తక్కువ కాకుండా చూడాలన్నారు.