కనిగిరిని కనకపట్నంగా మారుస్తా: సీఎం
ప్రకాశం జిల్లాలోని పీసీపల్లి మండలం జి. లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు పైలాన్‌ను మంగళవారం సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనిగిరి ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. భవిష్యత్తులో కనిగిరి కనకపట్నంగా మారుతుందని, వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లుగా ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మారుస్తానని సీఎం ప్రకటించారు.