VIDEO: బాసర గోదావరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
NRML: బాసర గోదావరి నది బస్ వంతెన మూడో పిల్లర్ వద్ద ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో మహిళ, పురుషుడు ఉన్నట్లు ఏఎస్సై గంగాధర్ తెలిపారు. స్నానఘట్టాల వద్ద పర్సు, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు బాసర పోలీసులను సంప్రదించాలని సీఐ కిరణ్ కుమార్ కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వెల్లడించారు.