ఉరేసుకుని స్కూల్ విద్యార్థిని మృతి
కోనసీమ: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రపురం భాష్యం స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న రంజిత చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీచర్ వేధింపులకు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.