వికలాంగులపై రాజకీయ వేధింపులు తగదు: జేఏసీ

వికలాంగులపై రాజకీయ వేధింపులు తగదు: జేఏసీ

CTR: వికలాంగుల పింఛన్ దారులపై రాజకీయ వేధింపులు ఆపాలని ఏపీ వికలాంగుల సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఐరాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మురళి, జిల్లా అధ్యక్షురాలు సుమతి నేతృత్వంలో నిరసన చేపట్టారు. గోవిందరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వికలాంగులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేశారు.