అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని పరిశీలించిన చిన్నారెడ్డి

WNP: శ్రీరంగాపురం మండలం జనంపేటలో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గ్రామ రైతుల పిలుపు మేరకు జనంపేట బునాదిపురం మధ్యలో ఉన్న వాగు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పనులను పునః ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు.