కొమరోలులో నేడు పవర్ కట్
ప్రకాశం: కొమరోలు మండలంలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. మండలంలోని చింతలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గోహారపల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు ఈ విద్యుత్ అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.