జిల్లాలో పుంజుకుంటున్న కోడి గుడ్డు ధరలు
కాకినాడ జిల్లాలో పడిపోయిన కోడిగుడ్డు ధర మెల్లిగా పుంజుకుంటోంది. మొన్నటి వరకు రూ. 4 ఉన్న ధర ఇప్పుడు రూ. 5కు చేరుకుంది. ధరలు పడిపోవడంతో ఆందోళన చెందిన కోళ్ల రైతులకు తాజా పెరుగుదల ఊరటనిస్తోంది. ధర పెరిగినా అమ్మకాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గుడ్ల వినియోగం పెరిగింది.