అమరవీరుల స్మారక పైలాన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

అమరవీరుల స్మారక పైలాన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

NLG: శాలిగౌరారం మండలం వల్లాలలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారక పైలాన్‌ను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే సామేలు మంగళవారం పరిశీలించారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఉద్యమం నిర్మాణమైందన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం అమరవీరుల స్మారక పైలాన్‌ను నిర్మించడం జరిగిందన్నారు. త్వరలో అమరవీరుల స్మారక పైలాన్ ప్రారంభిస్తామన్నారు.