వృద్ధుడికి అండగా నిలిచిన కానిస్టేబుల్
SRCL: సిరిసిల్లలోని చంద్రంపేట మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఓ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన ఒక వృద్ధుడు నడవలేక ఇబ్బంది పడుతుండటం గమనించిన ఆయన, వెంటనే స్పందించి వృద్ధుడిని వీల్ చైర్‌పై కూర్చోబెట్టి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లారు. ఆ వృద్ధుడు క్షేమంగా ఓటు వేసేలా సాయం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.