కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
RR: పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని షాద్ నగర్ MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామానికి చెందిన BRS నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. మనది శ్రమజీవుల పార్టీ అని, గ్రామాల్లో సంపూర్ణ అభివృద్ధి జరగాలన్నారు.