తాగునీటికి కటకట

తాగునీటికి కటకట

SKLM: ఎల్.ఎన్.పేట మండలంలోని దబ్బపాడులో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు మాజీ సర్పంచ్ జమ్మి పద్మావతి తెలిపారు. కుళాయిల ద్వారా తాగునీరు ఎప్పుడు వస్తుందో? తెలియని దుస్థితి నెలకొందన్నారు. 700 ఇల్లు, 2వేలకు పైగా జనాభా ఉన్న గ్రామంలో పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న తాగునీటి బోరు ఆరు నెలలుగా పని చేయడం లేదని వాపోయారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.