'పీ.ఆర్.సీ.ని తక్షణమే ప్రకటించాలి'

AKP: పీ.ఆర్.సీ.ని తక్షణమే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి వెంకటపతి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జంపపాలెం జడ్పీ హైస్కూల్లో సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలన్నారు. అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.