వరద నీటిని మళ్లించిన అధికారులు
AKP: సబ్బవరం మండలం ఒమ్మివానిపాలెం వద్ద రైవాడ కాలువకు గండి పడింది. తక్షణమే స్పందించిన తహసీల్దార్ చిన్ని కృష్ణ, సీఐ రామచంద్రారావు ఆ ప్రాంతానికి వెళ్లి అధికారులను అప్రమత్తం చేశారు. వరదనీరు పొలాల్లోకి వెళ్లకుండా జేసీబీతో మళ్ళించారు. దీంతో పంట నష్టం తప్పింది. మండలంలో తుఫాను ప్రభావంతో 204 మి.మీ. వర్షపాతం నమోదయినట్లు తహసీల్దార్ తెలిపారు.