VIDEO: నగరంలో రాళ్ల వర్షం
HYD: నగరంలో పలు చోట్ల రాళ్ల వర్షం కురుస్తోంది. దీంతో కూకట్ పల్లి, మియాపూర్, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కొత్తగూడ, హైటెక్ సిటీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. 5 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ వర్షంలో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.