'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి'

GDWL: ఉండవెల్లి మండలంలో జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తేనే తదుపరి విడత నిధులు సకాలంలో అందుతాయని స్పష్టం చేశారు.