ఉమ్మడి జిల్లాలో మత్స్యకారులకు GOOD NEWS

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవటంతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. దీంతో మత్స్య శాఖ అధికారులు చేప పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,253 చెరువుల్లో 10.38 కోట్ల చేప పిల్లలను వదలాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే గద్వాల జిల్లాలో టెండర్ ప్రక్రియ మొదలెట్టామని అధికారులు తెలిపారు.