'పల్లె దవాఖాన నిర్మాణం పూర్తి చేయాలి'

'పల్లె దవాఖాన నిర్మాణం పూర్తి చేయాలి'

GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్‌లో అసంపూర్తిగా ఉన్న పల్లె దవాఖాన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ మేరకు వారు వడ్డేపల్లి పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి లక్ష్మణ్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వైద్యాధికారి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.