రాష్ట్రస్థాయికి ఎంపికయిన మోడల్ స్కూల్ విద్యార్థిని
SRPT: ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రములోని మోడల్ స్కూల్‌కి చెందిన పదవ తరగతి విద్యార్థిని సుప్రియా, ఎస్.వీ. డిగ్రీ కాలేజ్‌లో జరిగిన అండర్–17 విభాగపు క్రీడా పోటీల్లో డిస్కస్ త్రోలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రథమ స్థానం సాధించిందని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సుప్రియను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.