ముంపు ప్రాంతాల్లో బోటులో ప్రయాణించిన గంటా
VSP: భీమిలి మండలం పెద నాగమయ్యపాలెంలో ముంపు బాధితులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బోటులో వెళ్లి పరామర్శించారు. తుపాను రక్షణ కేంద్రంలో తలదాచుకుంటున్న 32 కుటుంబాలకు నిత్యావసరాలను బుధవారం అందజేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.