ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షాలతో పత్తి పంట దెబ్బతినడంతో, రైతు ఇటుకల ఉపేందర్ రెడ్డి (40) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారని అకాల వర్షంతో మానసిక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెప్పారు.