ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభానికి మరమ్మతులు

NRPT: భారీ వర్షాలు కురుస్తున్నా కూడా విద్యుత్ శాఖ సిబ్బంది తమ విధులను కొసాగిస్తున్నారు. కోస్గి మండలం మాదిగింట్లకుంట చెరువులో నందిగామకు చెందిన వెంకట్ ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభానికి మరమ్మతులు చేశాడు. విఠలాపూర్ ఫీడర్ లైన్ క్లియర్ చేయడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా కొనసాగింది. ధైర్యంగా మరమ్మతులు చేయడం అభినందనీయమని ప్రజలు అభినందించారు.