క్రోసూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

PLD: క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అమరావతి గ్రామానికి చెందిన షేక్ జరీనా జానీ ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.