పుట్టపర్తి అర్బన్ సీఐగా తిమ్మారెడ్డి బాధ్యతలు స్వీకరణ

పుట్టపర్తి అర్బన్ సీఐగా తిమ్మారెడ్డి బాధ్యతలు స్వీకరణ

సత్యసాయి: పుట్టపర్తి అర్బన్ సీఐగా తిమ్మారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీస్ సేవలు అందిస్తామని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి కట్టడి చేస్తామని స్పష్టం చేశారు.