VIDEO: బాలికల హాస్టల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే సునీత

MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల హాస్టల్ భవనంలో అస్వస్థకు గురైన బాలికలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఆదివారం అల్పాహారం స్వీకరించి 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. హాస్టల్ భవనంలో మౌలిక వసతులను ఆమె పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.