'టూరిస్టులపై దాడులు సరికాదు'

SKLM: జమ్మూ కాశ్మీర్ పహాల్గామ్‌లో పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం రాత్రి హిరమండలం మండలం మర్రిగూడ గ్రామంలో క్రొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా తెలిపారు. టూరిస్ట్‌లపై టెర్రరిస్ట్‌లు దాడిచేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు.