క్వింటా పత్తి ధర రూ. 7560, మిర్చి ఎంతంటే?

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభమైంది. మూడు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7,560 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మిర్చి ధరలు క్వింటా తేజ మిర్చి ధర రూ.12,100 పలకగా, 341 రకం మిర్చికి రూ.11 వేల ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటాకు రూ.13 వేలు పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.