సన్‌రైజర్స్ ఆటతీరుపై కోచ్ అసంతృప్తి

సన్‌రైజర్స్ ఆటతీరుపై కోచ్ అసంతృప్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజాగా దీనిపై SRH హెడ్ కోచ్ డేనియల్ విటోరి స్పందించాడు. జట్టు ప్రదర్శనలో నిలకడ లోపించిందని ఆయన తెలిపాడు. 'మేము ఈ సీజన్‌లో బాగా ఆడాలని గొప్ప ఆశలతో వచ్చాము. కానీ, దురదృష్టవశాత్తూ మేము అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాము. మా ఆటతీరులో స్థిరత్వం కొరవడింది' అని పేర్కొన్నాడు.