VIDEO: గ్రామపంచాయతీకి శవపేటిక అందజేత
పెద్దపల్లి: రాఘవపూర్ గ్రామంలో మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో శవపేటికను శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ తాటిచెట్టి చామంతి, పంచాయతీ కార్యదర్శి భాను ప్రకాశకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య మిత్రులు, గ్రామస్తుల సహకారంతో వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన డబ్బులతో శవపేటిక కొనుగోలు చేసి గ్రామపంచాయతీకి అందజేశామన్నారు.