రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ELR: ముదినేపల్లి మండలంలోని స్తంభం చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌కు చెందిన కుంటుమాల ప్రదీప్ (30) మృతి చెందారు. వడాలిలో స్నేహితుడి ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రాక్టరును అదుపుతప్పి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రదీప్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.